ఎంతో బాధగా ఉంది: ముష్ఫికర్‌ భావోద్వేగం

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించడాన్ని అతడి సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. హసన్‌ లేకుండా క్రికెట్‌ ఎలా ఆడాలంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. హసన్‌తో తమకున్న అనుబంధాన్ని సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీం, వెటరన్‌ బౌలర్‌ మోర్తాజా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుకున్నారు. చాంపియన్‌లా హసన్‌ తిరిగొస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు.



'సమ వయస్కులమైన మేమిద్దరం 18 ఏళ్ల పాటు కలిసి క్రికెట్‌ ఆడాం. మైదానంలో నువ్వు లేకుండా క్రికెట్‌ ఆడాలన్న ఆలోచన ఎంతో బాధగా ఉంది. త్వరలోనే నువ్వు చాంపియన్‌లా తిరిగొస్తావు. నీకు ఎల్లప్పుడు నా మద్దతు, మొత్తం బంగ్లాదేశ్‌ అండదండలు ఉంటాయి. ధైరంగా ఉండు' అంటూ ముష్ఫికర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు. హసన్‌తో కలిసివున్న ఫొటోను షేర్‌ చేశాడు.